షా పర్యటనతో రాజుకున్న రాజకీయ వేడి.. బుజ్జగింపు చర్యలకు దిగిన తృణమూల్‌ కాంగ్రెస్

షా పర్యటనతో రాజుకున్న రాజకీయ వేడి.. బుజ్జగింపు చర్యలకు దిగిన తృణమూల్‌ కాంగ్రెస్
x
Highlights

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజీనామాలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును...

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజీనామాలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెట్టడం ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతుండటం తృణమూల్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తృణమూల్‌లో కీలక నేత అయిన సువేందు తివారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో వీరంతా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్‌ పర్యటను వెళ్తుండటంతో రాజకీయ వేడిని రేపుతోంది.

ఇప్పటికే బెంగాల్ చేరుకున్న అమిత్ షా రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అధికార పక్షాన్ని వీడిన ఎమ్మెల్యేలు ఆయన సమక్షంలో పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది తృణమూల్ కాంగ్రెస్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories