Tamil Nadu: మరింత హీట్‌ పుట్టిస్తున్న తమిళ పాలిటిక్స్

Tamil Nadu: చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర హైడ్రామా

Sandeep Eggoju
Updated on: 5 Dec 2021 7:30 PM IST
Political Heat in Tamil Nadu
X

మరోసారి తమిళనాడులో రాజకీయ రగడ (ఫైల్ ఇమేజ్)

Tamil Nadu: తమిళనాట పొలిటికల్ హీట్ నెక్స్ట్‌ లెవెల్‌కు చేరింది. శశికళ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకుండా బైలాస్ మార్చడంతో రాజుకున్న రచ్చ అంతకంతకూ పెరుగుతోంది. డీఎంకేలోకి ఎంట్రీ ఇవ్వకుడా బైలాస్ మార్చిన 24 గంటల్లోనే శపథం చేసిన శశికళ ఇవాళ ఇంకాస్త దూకుడు పెంచినట్లు కనిపించారు. జయలలిత వర్ధంతి సందర్భంగా చెన్నై మెరీనా బీచ్ దగ్గర హైడ్రామా నెలకొంది. జయకు నివాళిలు అర్పించేందుకు పళనిస్వామి వర్గం, శశికళ వర్గం ఒకేసారి వచ్చాయి. ఈ సమయంలో ఇరు వర్గాలు బలప్రదర్శన చేశాయి. ముఖ్యంగా పళనిస్వామి గోబ్యాక్ అంటూ శశి టీమ్ నినాదాలు చేసింది. దీంతో కాసేపు మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story