Top
logo

మావోయిస్టుల కట్టడి దిశగా ఉమ్మడి కార్యాచరణ

మావోయిస్టుల కట్టడి దిశగా ఉమ్మడి కార్యాచరణ
X
Highlights

మావోయిస్టుల కట్టడి దిశగా ప్రభావిత రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులు ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఒక...

మావోయిస్టుల కట్టడి దిశగా ప్రభావిత రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులు ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఒక రాష్ట్రంలో మావోయిస్టులకు ఇబ్బందులు తలెత్తితే పొరుగు రాష్ట్రంలోని సేఫ్‌ జోన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నందున అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ డీజీపీలు ఆపరేషన్ల వ్యూహంపై చర్చించారు.

ప్రస్తుతం మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్రంగా ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్‌ఎస్ కార్యకర్త భీమేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే భీమేశ్వర్‌కు పట్టిన గతే పడుతుందంటూ మావోయిస్టులు ఇతర నేతలను హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించారు. ఈ తరహా ఘటనల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణాపైనా ఆపరేషన్లు చేపట్టనున్నారు. ఈ కార్యాచరణకు ఛత్తీస్‌గఢ్‌ నిఘా విభాగం ఐజీ ఆనంద్‌ చాబ్రాను నోడల్‌ అధికారిగా నియమించారు.

అంతర్రాష్ట్ర ఆపరేషన్లలో తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలే కీలకం కానున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు సరిహద్దులైన తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కనిపించాయి. దీంతో గ్రేహౌండ్స్, పోలీసు సిబ్బంది అడువులను జల్లెడ పడుతున్నాయి. నాలుగు నెలల్లో కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 8 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టుల కట్టడి దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

Web Titlepolice planning to interstate combing operations for Maoists
Next Story