Lottery: కానిస్టేబుల్‌ జాక్‌పాట్‌.. ఆరు రూపాయ‌ల‌తో కోటీశ్వ‌రుడయ్యాడు!!

Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం.

Arun Chilukuri
Published on: 5 Aug 2022 11:55 AM IST
Police Constable Wins ₹1-crore Lottery
X

Lottery: కానిస్టేబుల్‌ జాక్‌పాట్‌.. ఆరు రూపాయ‌ల‌తో కోటీశ్వ‌రుడయ్యాడు!!

Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. ఓ కానిస్టేబుల్‌ కి లాటరీలో ఏకంగా కోటి రూపాయల జాక్‌పాట్ తగలడంతో అతడి జీవితమే మారిపోయింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ సింగ్ అనే వ్యక్తి.. పంజాబ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. కుల్దీప్‌ సింగ్‌ తల్లి ఓ రోజు లాటరీ టికెట్లు కొనాలని కుమారుడికి సూచించింది.

ఈ క్రమంలో అతడు అమ్మ మాటను కాదనలేకపోయాడు. గత ఆరు నెలలుగా లాటరీ టికెట్ కొంటూనే ఉన్నాడు. తాజాగా ఈ నెల 2న కూడా లుథియానాలోని ఓ దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఒక్క టికెట్ రూ.6 చొప్పున.. రూ.150 ఖర్చు చేసి 25 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అందులో రూ.ఆరు పెట్టి కొన్న లాటరీ కూడా ఉంది. ఇప్పుడు అదే ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story