Yamuna River: కాలుష్యమయంగా యమునా నదీ

* నదిలో పెరిగిన అమ్మోనియా స్థాయి * యమునా నదిలోకి వెళ్తున్న 90శాతం వ్యర్థ జలాలు

Shilpa
Updated on: 9 Nov 2021 11:16 AM IST
Poisonous Foams are Floating in Yamuna River in Delhi
X

కాలుష్యమయంగా యమునా నదీ(ఫైల్ ఫోటో)

Yamuna River: పుణ్యనదుల్లో ఒకటైన యమునా నదీ జలాలు కాలుష్యమయంగా మారాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తుండగా విషపు నురుగలు తేలియాడుతున్నాయి. అయినా దానిలోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

సోమవారం ఉత్తరాది రాష్ట్రాల్లో 'ఛఠ్ పూజ' వేడుకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కాలింద్ కుంజ్ వద్ద యమునా నది ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయి. వాటిని కూడా లెక్కచెయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు

యమునా నదిలో అమ్మోనియా స్థాయి పెరిగిందని ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. మరోవైపు 90 శాతం వ్యర్థ జలాలు యమునా నదిలోకి వెళ్తాయి. 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని కూడా యమునా నదిలో వదులుతున్నారు. మురుగు నీటిలో ఫాస్ఫేట్, ఆమ్లం ఉంటాయి. ఇది విషపూరిత నురుగుగా ఏర్పడటానికి కారణమవుతాయి.

Shilpa

Shilpa

Next Story