సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి: ప్రధాని మోడీ

సైనికులతో ఉన్నప్పుడే తనకు నిజమైన దీపావళి అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రతీ ఏడాది లానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలను జరుపుకున్నారు.

admin
Published on: 14 Nov 2020 3:16 PM IST
సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి: ప్రధాని మోడీ
X

సైనికులతో ఉన్నప్పుడే తనకు నిజమైన దీపావళి అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రతీ ఏడాది లానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలను జరుపుకున్నారు. రాజస్తాన్‌లోని జైసల్మీర్‌ లొంగ్వాలాలో సైనికులతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్న మోడీ.. వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. దీపావళి రోజు ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) డిజి రాకేశ్ అస్థానా కూడా ప్రధానితో పాటు ఉన్నారు.


admin

admin

Next Story