OLXలో అమ్మకానికి ప్రధాని మోడీ ఆఫీస్.. నలుగురు అరెస్ట్!

వారణాసిలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న మోడీ పార్లమెంటరీ కార్యాలయాన్ని విల్లాగా పేర్కొంటూ వివరాలు, ఫోటోలతో సహా సైట్ లో పెట్టేశారు.

Krishna
Published on: 18 Dec 2020 4:30 PM IST
OLXలో అమ్మకానికి ప్రధాని మోడీ ఆఫీస్.. నలుగురు అరెస్ట్!
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్ ను కొంతమంది వ్యక్తులు రూ. 7.5 కోట్ల రూపాయలకు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. వారణాసిలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న మోడీ పార్లమెంటరీ కార్యాలయాన్ని విల్లాగా పేర్కొంటూ వివరాలు, ఫోటోలతో సహా సైట్ లో పెట్టేశారు. 6500 చదరపు అడుగుల విస్తీర్ణం, 4 గదులు, 4 బాత్‌రూమ్‌లతో పాటుగా కార్ పార్కింగ్‌తో వివరాలను OLX వెబ్ సైట్ లో పొందుపరిచారు. దీనిపైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ పోస్టును వెంటనే తొలిగించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.


Krishna

Krishna

Next Story