Narendra Modi: అర్ధరాత్రి కాశీ వీధుల్లో నడిచిన మోడీ.. ఎందుకంటే...

Narendra Modi: ప్రధాని మోడీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు...

Shireesha
Published on: 14 Dec 2021 11:54 AM IST
PM Narendra Modi Walking on Kashi Roads at Midnight with Yogi Adityanath | National News
X

Narendra Modi: అర్ధరాత్రి కాశీ వీధుల్లో నడిచిన మోడీ.. ఎందుకంటే...

Narendra Modi: ప్రధాని మోడీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ కాశీలో పర్యటిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ.. సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకూ సాగింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మోడీ నగరంలో లేట్‌ నైట్‌ టూర్‌కు వెళ్లారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కొంతసేపు కాశీ వీధుల్లో నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కాశీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించామని... ఈ పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు బనారస్‌ రైల్వే స్టేషన్‌ను ప్రధాని సందర్శించారు.

Shireesha

Shireesha

Next Story