PM Modi: మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ..

PM Narendra Modi: గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు.

Arun Chilukuri
Updated on: 1 Nov 2022 9:45 PM IST
PM Narendra Modi Visits Site Of Gujarat Bridge Tragedy, Meets Survivors
X

PM Modi: మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ..

PM Narendra Modi: గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. ప్రమాద కారణాలు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మోడీ పరామర్శించారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఇతర ఉన్నతాధికారులున్నారు. అయితే ప్రధాని రాకముందే ఈ బ్రిడ్జ్‌కు మరమ్మతులు చేసిన సంస్థ పేరును కనిపించకుండా ప్లాస్టిక్ షీట్‌తో కవర్ చేశారు. దీనిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 135మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పలువురి ఆచూకీ గల్లంతు కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story