పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి

Narendra Modi: ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌కు భారీ బహుమతి ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 7 Jan 2022 7:21 PM IST
PM Narendra Modi Virtually Inaugurates Bengal Hospital
X

పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి

Narendra Modi: ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌కు భారీ బహుమతి ఇచ్చారు. కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను ప్రధాని మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రధాని మోడీతో పాటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ సందర్భంగా ఉప్పూనిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతలు కాసేపు రాజకీయాలను, విభేదాల్ని వదిలిపెట్టారు.

నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని ప్రశంగించారు. దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామన్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story