Narendra Modi: ప్రధాని మోడీ అమెరికా టూర్ ఖరారు.. మోడీ కోసం స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్న జో బిడెన్

Narendra Modi: జూన్ 22న అమెరికాలో మోడీ పర్యటన

Dhatripriya
Published on: 11 May 2023 9:26 AM IST
PM Narendra Modi to Visit America Next Month
X

Narendra Modi: ప్రధాని మోడీ అమెరికా టూర్ ఖరారు.. మోడీ కోసం స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్న జో బిడెన్

Narendra Modi: ప్రధాని మోడీ జూన్‌ నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22న ప్రధాని మోదీ కోసం జో బైడెన్, జిల్ బైడెన్‌ స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని కేంద్రం తెలిపింది. జీ20 కూటమికి ఈ ఏడాది భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కె జీన్ పియర్ మాట్లాడారు. జో బైడెన్, జిల్ బైడెన్ అధికారిక రాష్ట్ర పర్యటన కోసం అమెరికాలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని తెలిపారు. అంతేకాక, వైట్ హౌస్‌లో జూన్ 22న స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. భారత ప్రధాని పర్యటన రెండు దేశాల మధ్య బలమైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

మోడీ, బైడెన్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు రంగాల బలోపేతంపై రెండు దేశాలు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నాయి. సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, పరిశోధన, విద్య, క్లీన్ ఎనర్జీ, రక్షణ, భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారంపై ఇద్దరు నాయకులు సమీక్షించే అవకాశాలు ఉన్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story