ఎల్లుండి సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. కీలక ప్రకటన రానుందా..?

Narendra Modi: భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Arun Chilukuri
Updated on: 11 Jan 2022 6:32 PM IST
PM Narendra Modi to Hold Meeting with CMs on Covid situation on 13th January 2022
X

ఎల్లుండి సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. కీలక ప్రకటన రానుందా..?

Narendra Modi: భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కానున్నారు. సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం గురువారం జరగనుందని పీఎంవో వర్గాలు తెలిపాయి. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

కరోనా కట్టడికి ఎటువంటి సూచనలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ సూచించనున్నారు. అలాగే ఆర్ధిక పరిస్థితిపైనా ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story