Narendra Modi: జల్ జీవన్ మిషన్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

*నీటి సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పం *జల జీవన్ మిషన్ వల్ల మహిళలు సాధికారులవుతున్నారన్న మోడీ

Shilpa
Published on: 2 Oct 2021 5:01 PM IST
PM Narendra Modi Started Jal Jeevan Mission Mobile App
X

Narendra Modi: జల్ జీవన్ మిషన్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Narendra Modi: జల జీవన్ మిషన్‌ మహిళల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారిని సాధికారులను చేస్తోందని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. జల జీవన్ మిషన్ మొబైల్ యాప్‌ను ఇవాళ ప్రధాని ప్రారంభించారు. జల జీవన్ మిషన్ వల్ల మహిళలు సాధికారులవుతున్నారని మోడీ స్పష్టం చేశారు. గతంలో తాగునీటిని తేవడం కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చేదన్న ప్రధాని ఆ సమయం, శ్రమ జల జీవన్ మిషన్ వల్ల ఆదా అవుతున్నాయన్నారు. అనంతరం వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, గ్రామీణ నీరు, పారిశుద్ధ్యం కమిటీల ప్రతినిధులతో ప్రధాని మోడీ ఇంట్రాక్ట్ అయ్యారు.

Shilpa

Shilpa

Next Story