Modi plants a Parijat sapling: అయోధ్యలో మోదీ నాటిన మొక్క ఇదే..

Arun Chilukuri
Published on: 5 Aug 2020 1:01 PM IST
Modi plants a Parijat sapling: అయోధ్యలో మోదీ నాటిన మొక్క ఇదే..
X

Modi plants a Parijat sapling: అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పారిజాత మొక్కను నాటారు. రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం చేశారు. అనంతరం మోదీ అక్కడ పారిజాత మొక్కను నాటారు. ప్రదానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు హనుమాన్‌గఢీ ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు, భూమి పూజ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీజీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story