Narendra Modi: దహేగామ్‌లో ప్రధాని మోదీ 22 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో...

Narendra Modi: ఓపెన్‌ డోర్‌ వాహనంలో మోదీ 22 కిలోమీటర్ల రోడ్‌ షో...

Shireesha
Published on: 12 March 2022 12:39 PM IST
PM Narendra Modi Huge Road Show at Dahegam | National News
X

Narendra Modi: దహేగామ్‌లో ప్రధాని మోదీ 22 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో... 

Narendra Modi: ప్రధానమంత్రి మోదీ రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా దహేగాంలోని చిలోడా నుంచి యూనివర్శిటీ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా నిలుచున్న వేలాది మంది ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. చిలోడా నుంచి రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ వరకు 22 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దారి పొడవునా... ఇళ్లు, భవనాలపై ఎక్కి ప్రజలు మోదీకి అభివాదం చేశారు. పలు చోట్ల ప్రధానిపై పుష్ఫవర్షం కురిపించారు. ప్రధాని మోదీకి జై.. భాతర్‌ మాతాకీ జై అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

గుజరాత్‌ రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో 4 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో గుజరాత్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రధాని సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికలకు సంబంధించి నాయకులకు ప్రధాని దిశా నిర్దేశం చేశారు.

Shireesha

Shireesha

Next Story