PM Modi new car: ప్రధాని మోడీ కాన్వాయ్‌లో ఫువర్‌ఫుల్‌ కారు‌.. ఈ కారు ఖరీదు ఎంతో తెలుసా?

*ఇది వీఆర్-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది *రెండు ఎస్-650 గార్డ్ కార్లు కొనుగోలు

Arun Chilukuri
Updated on: 28 Dec 2021 8:30 PM IST
PM Narendra Modi gets new Rs 12-Crore Mercedes-Maybach S650 Guard
X

ప్రధాని మోడీ భద్రతకు ఎస్‌-650 గార్డ్‌

PM Modi new car: ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సరికొత్త కారును తీసుకొంది. మెర్సిడీస్ ‌- మైబహ్‌ ఎస్‌-650 గార్డ్‌'ని కొనుగోలు చేసింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కారులోనే హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకొన్నారు. ఈ కారు ఖరీదు 12 కోట్లు. ఇది VR-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. ఇటీవల స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ప్రధాని భద్రతకు కొన్ని అవసరాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు S-650 గార్డ్‌ కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరోకారును డికాయ్ ‌ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనంగా వినియోగిస్తారు.

ఇక కారు ఫీచర్ల విషయానికి వస్తే ఎస్‌600 గార్డ్ కారులాగే S650 గార్డ్ కూడా డైరెక్టివ్ బీఆర్‌వీ 2009 వెర్షన్ (శత్రుదుర్భేధ్యమైన శ్రేణి) 2 ప్రకారం వీఆర్‌10 రక్షణ స్థాయిని అందిస్తుంది. వెహికల్‌ సెఫ్టీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక సెఫ్టీ రేటింగ్‌ ఇదే. వీఆర్‌10 రేటింగ్ ఉండటంతో ఈ కారు బాడీ, విండోస్‌ బుల్లెట్‌లను తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది. అంతేకాకుండా ఎక్స్‌ప్లోజివ్ రెసిస్టెంట్‌ వెహికల్ (ERV) విషయంలో 2010 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్‌టీలాంటి శక్తివంతమైన పేలుడు సంభవించిన కారులో ఉన్నవారికి భద్రత లభిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story