Narendra Modi - Army: సైనికులతో కలిసి ప్రధాని మోడీ దీపావళి సంబురాలు

Narendra Modi - Army: 2014 నుంచి ఏటా సైనికులతో వేడుకలు జరుపుకుంటున్న మోడీ...

Shireesha
Updated on: 4 Nov 2021 12:30 PM IST
PM Narendra Modi Diwali Celebrations with Indian Army at Jammu Kashmir | National News Today
X

Narendra Modi - Army: సైనికులతో కలిసి ప్రధాని మోడీ దీపావళి సంబురాలు

Narendra Modi - Army: ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రాజౌరీ జిల్లా నౌషిరా సెక్టార్‌లోని L.O.C వెంబడి జవాన్లతో కలిసి దీవాళీ వేడుకలను ప్రధాని మోడీ జరుపుకోనున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.

మరోవైపు.. కశ్మీర్ లో ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు భద్రతాబలగాలు భారీ ఆపరేషన్ చేస్తున్న నేపధ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ పర్యటన జవాన్లలో మనోధైర్యాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ వచ్చారు. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు మోడీ వచ్చారు. జమ్మూకు రాగానే ఆర్మీ ఉన్నతాధికారులు, ఇతర జవాన్లను కలిశారు. మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ఔట్‌పోస్టులను సందర్శించారు. 2019లో కూడా రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

Shireesha

Shireesha

Next Story