PM-KISAN: పీఎం కిసాన్‌ నిధులు విడుదల

PM-KISAN: పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 1 Jan 2022 3:57 PM IST
PM Narendra Modi Distributes Rs 20,000 Crore Under PM-KISAN Scheme For Farmers
X

PM-KISAN: పీఎం కిసాన్‌ నిధులు విడుదల

PM-KISAN: పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పదో విడతగా విడుదలైన ఈ నగదును దేశంలోని 10 కోట్ల మంది లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు. తొలి తొమ్మిది విడతలకు కలిపి మొత్తం లక్షా అరవై వేల కోట్లను రిలీజ్‌ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇవాళ మరో 20వేల కోట్ల నిధులను విడుదల చేశారు.

దేశ ఆర్ధిక వృద్ధి రేటు 8శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. రికార్డ్‌ స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ కలెక్షన్ల విషయంలో గత రికార్డులు అన్నీ బద్దలయ్యాయన్నారు. 2021లో దేశంలో యూపీఐ పద్ధతి ద్వారా 70లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు మోడీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story