Narendra Modi: ఏపీ, తెలంగాణ విభజన సామరస్య పద్ధతిలో జరగాల్సింది

Narendra Modi: కాంగ్రెస్ వల్లే దేశంలో అవినీతి చీడ

Rama Rao
Published on: 8 Feb 2022 2:19 PM IST
PM Narendra Modi Comments On Congress | National News Today
X

Narendra Modi: ఏపీ, తెలంగాణ విభజన సామరస్య పద్ధతిలో జరగాల్సింది

Narendra Modi: దేశంలో అన్ని కష్టాలకు కాంగ్రెస్సే కారణమన్నారు ప్రధాని మోడీ. అర్బన్ నక్సలైట్లు, కాంగ్రెస్‌కు తేడా లేదన్న ప్రధాని.. కాంగ్రెస్ లేకపోతే దేశంలో ఎమర్జెన్సీ వచ్చేదే కాదన్నారు. కాంగ్రెస్ వల్లే దేశంలో అవినీతి చీడ పెరిగిందని విమర్శించారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల విభజనపై హాట్ కామెంట్స్ చేశారు. అధికార దాహంతో ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సొంత నేతలనూ వాళ్లు పట్టించుకోలేదని, సభలో మైకులు కట్ చేశారని, డోర్లు మూసేసి ఏపీని విభజించారని అసహనం వ్యక్తం చేశారు. వాజ్ పేయి మూడు రాష్ట్రాలను విభజించినా. శాంతియుత వాతావరణంలో రాష్ట్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణను తాము వ్యతిరేకించడం లేదని, కానీ, శాంతియుతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని మాత్రమే అంటున్నామని పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story