Narendra Modi: కేరళలోని పాలక్కాడ్‌లో ప్రధాని మోడీ రోడ్ షో

Narendra Modi: రోడ్ షో అనంతరం తమిళనాడు సభలో పాల్గొన్న మోడీ

Shashank Gullapelli
Published on: 19 March 2024 7:02 PM IST
PM Modi Road Show In Palakkad, Kerala
X

Narendra Modi: కేరళలోని పాలక్కాడ్‌లో ప్రధాని మోడీ రోడ్ షో

Narendra Modi: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో 370 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దక్షిణ భారతదేశంపైనే కమలనాథుల ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నాలుగైదు రోజులుగా దక్షిణ భారతదేశంలోనే మోడీ పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూనే నాలుగు వందల సీట్లు రావాలంటూ ప్రజలను కోరుతున్నారు. కేరళలోని పాలక్కాడ్ లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆయన రోడ్ షోలకు అనూహ్య స్పందన లభిస్తుంది. కేరళ రోడ్ షో అనంతరం తమిళనాడుకు మరోసారి మోడీ వెళ్లారు. తమిళనాడును అభివృద్ధే చేసే బాధ్యత ఎన్డీయేదని మోడీ తెలిపారు.PM Modi's Road Show In Palakkad, Kerala

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story