PM Modi: అమ్మ అనే పదం.. భావోద్వేగాల నిధి..

Heeraben Modi 100th Birthday: అమ్మ అంటే.. కేవలం పదం కాదని.. భావోద్వేగాల నిధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Arun Chilukuri
Published on: 18 Jun 2022 3:53 PM IST
PM Modi Emotional Blog on Heeraben Modi 100th Birthday
X

PM Modi: అమ్మ అనే పదం.. భావోద్వేగాల నిధి..

Heeraben Modi 100th Birthday: అమ్మ అంటే.. కేవలం పదం కాదని.. భావోద్వేగాల నిధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన తల్లి హీరాబా నూరో జన్మదినం సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌కు ప్రధాని వచ్చారు. ఆమె జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఆమె పాదాలకు నమస్కరించి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి హీరాబెన్‌కు పాదపూజ నిర్వహించి.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై అమ్మంటే.. కేవలం పదం కాదని.. భావోద్వేగాలను నిశ్చిప్తం చేసేదని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన కోసం తల్లి చేసిన అనేక త్యాగాలతోనే తాను ఇంత ఎత్తుకు ఎదిగినట్టు ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ రోజు తన జీవితంలో మరచిపోలేని రోజుని ప్రధాని తెలిపారు. తన తల్లితో అనుబంధం గురించి తన ఆలోచనలను రాసినట్టు ఓ బ్లాగ్‌ లింక్‌ను కూడా మోడీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story