Rahul Gandhi: మణిపుర్‌ను కాపాడాలన్న ఉద్దేశం ప్రధానికి లేదు..

Rahul Gandhi: లోక్ సభలో మోడీ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2023 4:47 PM IST
PM Modi Wants Manipur to Burn Says Rahul Gandhi
X

Rahul Gandhi: మణిపుర్‌ను కాపాడాలన్న ఉద్దేశం ప్రధానికి లేదు..

Rahul Gandhi: లోక్ సభలో మోడీ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మణిపుర్ అల్లర్లతో మండిపోతుంటే మోడీ మాత్రం నవ్వుతూ జోకులు వేశారన్నారు. మణిపూర్‌ను కాపాడాలన్న ఉద్దేశం ప్రధానికి లేదని చెప్పారు. మణిపూర్‌లో రగులుతున్న అగ్నికి ప్రధాని ఆజ్యం పోస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోడీ మణిపూర్ వెళ్లి రెండు వర్గాలతో మాట్లాడాలన్నారు. ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో మణిపుర్‌ అట్టుడుకుతోంటే.. ప్రధాని పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేశారు. విపక్షాలను విమర్శిస్తూ నినాదాలు చేశారు. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ, ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని నేను చూడలేదు అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story