PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోడీ పరామర్శ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి..

PM Modi: భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆలస్యం చేయకుండా నేరుగా పేలుడు ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 3:33 PM IST
PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోడీ పరామర్శ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి..
X

PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోడీ పరామర్శ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి..

PM Modi: భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆలస్యం చేయకుండా నేరుగా పేలుడు ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.

విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్‌ఎన్‌జేపీ (Lok Nayak Jai Prakash Narayan) ఆసుపత్రికి చేరుకున్న ప్రధాని మోడీ, ఢిల్లీ పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ విషాదకర ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story