నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన

* రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

R Tripura Malini
Published on: 18 Dec 2022 10:09 AM IST
PM Modi Visit To Meghalaya And Tripura States Today
X

నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఇవాళ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు 6వేల 800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ కౌన్సిల్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దాదాపు 2వేల 450 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. షిల్లాంగ్‌లోని ఉమ్‌సాలిలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story