ఈ ఏర్పాట్లు చేయండి : ముఖ్యమంత్రులకు ప్రధాని దశానిర్దేశం

ఈ ఏర్పాట్లు చేయండి : ముఖ్యమంత్రులకు ప్రధాని దశానిర్దేశం
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనావైరస్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 21 రోజుల జాతీయ లాక్‌డౌన్ మరియు వివిధ రాష్ట్రాల్లో కరోనావైరస్ పరిస్థితిపై సమీక్షించారు.

రాబోయే వారాల్లో పరీక్ష, ట్రేసింగ్, ఐసోలేషన్, ఖ్వారంటైన్ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రులకు చెప్పారు.. అలాగే అవసరమైన వైద్య ఉత్పత్తుల సరఫరా, ఔషదాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల లభ్యత మరియు వైద్య పరికరాల అవసరాన్ని ప్రధాని హైలైట్ చేశారు.

అంతేగాదు భారతదేశంలో వైరస్ కేసుల పెరుగుదల, నిజాముద్దీన్ మార్కాజ్ వ్యవరాహారం కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. అలాగే వైరస్ మరింతగా వ్యాప్తి చెందడం వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరించారు,

ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే COVID-19 వ్యాప్తి మరియు సంబంధిత విషయాలపై రెండు వారాలలలో ప్రధానమంత్రి రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 25 నుండి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన తరువాత మొదటి సమావేశం ఇది. చివరి సమావేశం మార్చి 20న జరిగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories