Omicron Cases: ఒమిక్రాన్‌పై రేపు ప్రధాని మోడీ కీలక సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..

Omicron Cases: దేశంలో కోవిడ్ డేంజర్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రకంపనలు పుట్టిస్తున్న నేపధ్యంలో ప్రధాని మోడీ కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2021 4:48 PM IST
PM Modi to Hold Review Meet on Covid-19 Situation Tomorrow
X

Omicron Cases: ఒమిక్రాన్‌పై రేపు ప్రధాని మోడీ కీలక సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..

Omicron Cases: దేశంలో కోవిడ్ డేంజర్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రకంపనలు పుట్టిస్తున్న నేపధ్యంలో ప్రధాని మోడీ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై రేపు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైరస్ కట్టడి చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్‌ కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపధ్యంలో రేపటి ప్రధాని భేటీ ప్రాధాన్యత ఏర్పడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story