PM Modi: ఆటంకాలను దాటుతూ భారత్‌ అమృతోత్సవ వేళకు చేరుకుంది

PM Modi: స్వాతంత్ర్యం తర్వాత భారత్‌ కొత్త యాత్ర ప్రారంభించింది

Jyothi
Updated on: 28 May 2023 2:34 PM IST
PM Modi Speech in New Parliament Building
X

PM Modi: ఆటంకాలను దాటుతూ భారత్‌ అమృతోత్సవ వేళకు చేరుకుంది

PM Modi: కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం అయ్యింది. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌ కొత్త యాత్ర ప్రారంభించిందన్నారు ప్రధాని మోడీ. ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్‌ అమృతోత్సవ వేళకు చేరుకుందన్నారు. అమృతోత్సవ వేళ మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలన్నారు. అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తుందన్నారు. ప్రధాని ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాలన్నారు. ముక్త భారత్‌ కోసం నవీన పంథా కావాలన్నారు.

కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుందన్నారు . ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం ఉన్నత స్ఫూర్తితో నిండిన భారతదేశం, అది బానిసత్వ ఆలోచనను వదిలివేస్తోందన్నారు. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు ప్రధాని మోడీ.

Jyothi

Jyothi

Next Story