PM Modi: బ్రిటన్‌ రాజుతో ప్రధాని మోదీ తొలిసారి ఫోన్‌ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ!

PM Modi: బ్రిటన్ రాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

Jyothi
Updated on: 4 Jan 2023 7:02 AM IST
PM Modi Speak to the King of Britain on the Phone
X

PM Modi: బ్రిటన్‌ రాజుతో ప్రధాని మోదీ తొలిసారి ఫోన్‌ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ!

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై ఇరువురు చర్చించారు. దీంతోపాటు జీ20కి భారత్ అధ్యక్షత, మిషన్ లైఫ్ తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. కామన్వెల్త్ దేశాలు, వాటి మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3 నియమితులైన అనంతరం.. ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా చార్లెస్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story