PM Modi: రాహుల్ వాయనాడ్‌లో ఓడిపోతారు

PM Modi: పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Updated on: 3 May 2024 6:16 PM IST
PM Modi Said Rahul Gandhi Was Already Losing In Wayanad
X

PM Modi: రాహుల్ వాయనాడ్‌లో ఓడిపోతారు

PM Modi: పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతోందని ప్రధాని అన్నారు. అమేథీని వదిలి రాయ్‌బరేలీకి రాహుల్ గాంధీ పారిపోయారని మోడీ ఎద్దేవా చేశారు. రాహుల్ వాయనాడ్‌లో ఓడిపోతారని ప్రధాని జోస్యం చెప్పారు. అందుకే వాయనాడ్ నుండి పారిపోయి రాయ్ బరేలీకి వచ్చాడన్నారు.

కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాల‌ని కోరుకుంటోంద‌ని, ద‌ళితులు, ఓబీసీ కోటాలను క‌త్తిరించి వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాల‌ని కుయుక్తులు ప‌న్నుతోంద‌ని మోదీ దుయ్య‌బ‌ట్టారు. విప‌క్షాలు దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని కోరుకోవ‌ని, ఓట్ల కోసం స‌మాజాన్ని విచ్ఛిన్నం చేయ‌డ‌మే వాటికి తెలిసిన మార్గ‌మ‌ని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story