మోడీ టీకా వేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓవైసీ

PM Modi received Covaxin
x

మోడీ టీకా వేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓవైసీ

Highlights

దేశ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. సామాన్య ప్రజలకి కోవిడ్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రజలు కరోనా టీకా తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు....

దేశ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. సామాన్య ప్రజలకి కోవిడ్‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రజలు కరోనా టీకా తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 'కొ-విన్' డిజిటల్ ప్లాట్‌పామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాయి.

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. మొదట ఫ్రంట్‌ వారియర్స్‌కి వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్త ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఆయనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ఇచ్చారు. పుదుచ్చేరికి చెందిన నర్సు నివేద మోడీకి వ్యాక్సిన్ వేశారు. కరోనా నియంత్రణకు డాక్టర్లు, సైంటిస్టులు చేసిన కృషిని ప్రధాని అభినందించారు. అర్హులందరు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ కరోనా టీకా కోవాగ్జిన్‌ తీసుకోవడంపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 64 ఏళ్లు పైబడిన వారు కోవాగ్జిన్‌ తీసుకోవడం ఉపయోగం లేదని జర్మనీ కోవిడ్ వెబ్‌సైట్లు స్పష్టం చేస్తున్నాయని ఓవైసీ గుర్తుచేశారు.

ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా టీకా తీసుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను టీకా తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. ఒడిశాను కోవిడ్ ర‌హిత రాష్ట్రంగా మారుద్దామ‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

కరోనా వ్యాక్సిన్ ధరల్ని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రైవేట్‌ హాస్పిటళ్లలో టీకా ధరను 250 రూపాయలుగా ఫిక్స్ చేశారు. టీకా ధర 150 రూపాయలు కాగా.. సర్వీస్ చార్జీ మరో 100 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇంతకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories