PM Modi: భవిష్యత్తులో పన్నులు మరింత తగ్గిస్తాం

PM Modi: భవిష్యత్తులో పన్నులు మరింత తగ్గిస్తాం
x
Highlights

PM Modi: రష్యాతో బంధం కాలపరీక్షలకు తట్టుకొని బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

PM Modi: రష్యాతో బంధం కాలపరీక్షలకు తట్టుకొని బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ గౌతమ్‌ బుద్ధానగర్‌‌లోని ట్రేడ్‌షోలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తోందన్నారు. దేశ స్వయం సమృద్ధిలో ఉత్తరప్రదేశ్‌ పాత్రను మోడీ కొనియాడారు. భారత్‌లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లలో అత్యధికం ఇక్కడినుంచే వస్తున్నాయన్నారు.

సెమీకండక్టర్‌ రంగంలోను భారత్‌ స్వయం సమృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్‌లోనే చిప్‌ నుంచి షిప్‌ వరకు అన్నీ తయారుచేయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తామని.. భవిష్యత్తులో పన్నులు తగ్గిస్తామని వ్యా‌ఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోందని ప్రధాని మోడీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories