PM Modi: వెంకయ్య సభను నడిపించే విధానం కొత్త వారికి ఆదర్శం

PM Modi: వెంకయ్యతో కలిసి పనిచేయడం అదృష్టం

Jyothi
Published on: 8 Aug 2022 12:42 PM IST
PM Modi Praises Venkaiah Naidu
X

PM Modi: వెంకయ్య సభను నడిపించే విధానం కొత్త వారికి ఆదర్శం

PM Modi: రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈనెల 10న ముగియనుంది. రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడికి ఘనంతా వీడ్కోలు పలికారు. రాజ్యసభలో వెంకయ్య నాయుడి వీడ్కోలు ప్రసంగాల్లో చప్పట్ల మోత మోగింది. వెంకయ్య చేసిన సేవలను పెద్దల సభలో సభ్యులు కొనియాడారు. వెంకయ్య నాయుడు తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకుంటూ అభినందనలతో ముంచెత్తారు. సభలో వెంకయ్య నిర్ణయాలు, అనుభవం సభ్యులందరికీ ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోడీ కొనియాడారు. సభను నడిపించే శైలి.. కొత్త వారికి ఆదర్శంగా ఉంటుందన్నారు వెంకయ్యనాయుడు చూపిన మార్గాన్ని భవిష్యత్తులో రాజ్యసభ అనుసరిస్తుందన్నారు వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోడీ వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story