PM Modi: ప్రధాని పర్యటనపై హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

PM Modi: మోడీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు

Jyothi
Updated on: 1 Oct 2023 9:13 AM IST
PM Modi Posters In Hyderabad
X

PM Modi: ప్రధాని పర్యటనపై హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనకు ముందు కొన్ని పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. మోడీకి తెలంగాణలో పర్యటించే హక్కులేదంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోడీకి.. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని పోస్టర్లు అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాల్లో పార్లమెంట్‌లో మోడీ మాట్లాడుతున్నట్లు పోస్టర్లు ఉన్నాయి. బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారన్న మోడీ వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ పోస్టర్లను అంటించారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్‌ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి.

Jyothi

Jyothi

Next Story