PM Modi: ప్రకాశ్‌ సింగ్ బాదల్‌కి ప్రధాని మోడీ నివాళి

PM Modi: రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు బాదల్ అవిశ్రాంతంగా పనిచేసాడు

Dhatripriya
Published on: 26 April 2023 2:03 PM IST
PM Modi Pays Homage To Parkash Singh Badal In Chandigarh
X

PM Modi: ప్రకాశ్‌ సింగ్ బాదల్‌కి ప్రధాని మోడీ నివాళి 

PM Modi: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ సీనియర్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులు ఆర్పించారు. గతకొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో మొహాలీ ఆసుపత్రిలో చేరిన బాదల్.. చికిత్స పొందుతూ మరణించారు. పంజాబ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బాదల్ అవిశ్రాంతంగా కృషి చేశారని మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించారని, బాదల్ అసాధారణ రాజనీతిజ్ఞుడని చెప్పారు. బాదల్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోదీ సంతాపం తెలిపారు. కాగా, ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్ మృతిపై పంజాబ్ లో రెండు రోజులు సంతాపదినాలుగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Dhatripriya

Dhatripriya

Next Story