PM Modi: పంచెకట్టిన ప్రధాని.. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ

PM Modi: కట్టెల పొయ్యిపై పాయసం వండిన ప్రధాని

Jyothi
Published on: 14 Jan 2024 12:55 PM IST
PM Modi Participated in Sankranti Celebrations
X

PM Modi: పంచెకట్టిన ప్రధాని.. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌ నివాసంలో జరిగిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టిన మోడీ.. కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు.

అనంతరం మాట్లాడిన ఆయన.. తన సొంత బంధువులతో కలిసి పొంగల్‌ను జరుపుకుంటున్నట్టు భావిస్తున్నానని చెప్పారు. పొంగల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క భావోద్వేగాన్ని వర్ణిస్తుందని అన్నారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా, అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు మరియు సంతృప్తి ప్రవహించాలని కోరుకుంటున్నట్టు మోడీ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story