PM Modi: విపక్షాల ధ్యాస అంతా అధికారం కోసమే.. కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాలు నో-కాన్ఫిడెన్స్ ప్రకటించాయి..

PM Modi No Confidence Motion Speech
x

PM Modi: విపక్షాల ధ్యాస అంతా అధికారం కోసమే.. కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాలు నో-కాన్ఫిడెన్స్ ప్రకటించాయి..

Highlights

PM Modi: కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాలు నో-కాన్ఫిడెన్స్ ప్రకటించాయని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

PM Modi: కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాలు నో-కాన్ఫిడెన్స్ ప్రకటించాయని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. అహంకారం నిండిన కాంగ్రెస్‌కు నేల కనిపించడం లేదన్నారు. దేశంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌కు దశాబ్దం పట్టిందన్నారు. ఢిల్లీ, ఏపీలో కాంగ్రెస్‌పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయని... యూపీ, బీహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని చెప్పారు. 1988లో చివరిసారి కాంగ్రెస్‌కు త్రిపురలో అధికారం దక్కిందని... ఒడిషాలో 28ఏళ్లు కాంగ్రెస్‌ను తిరస్కరించారన్నారు మోడీ.

అధిర్‌రంజన్‌ విపక్షాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మోడీ అన్నారు. కోల్‌కతా నుంచి ఫోన్‌ రాగానే అధిర్‌ అవిశ్వాసం పక్కనపెట్టారన్నారు. అధిర్‌రంజన్‌కు నా పూర్తి సానుభూతి తెలిపారు మోడీ.

దేశొంలో 13.5 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో పేదరికం క్రమంగా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటామన్నారు.

విపక్షాలకు పేదల ఆకలి మీద ధ్యాస లేదని... ధ్యాస అంతా అధికారం కోసమేనని ప్రధాని మోడీ అన్నారు. విపక్షాలు ప్రజా ఘాతుకానికి పాల్పడ్డాయని తెలిపారు. విపక్షాలు పదే పదే నోబాల్స్‌ వేస్తున్నాయని... అధికార పక్షం నుంచి సెంచరీలు వస్తున్నాయని చెప్పారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చినా విపక్షాలు సక్సెస్‌ కాలేదని మోడీ ఎద్దేవా చేశారు.

విపక్షాలకు పాకిస్థాన్‌ అంటే ప్రేమ అని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఏం చెబితే దాన్ని వారు నమ్ముతారన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేశామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ సత్తా చాటామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories