PM Modi lands in Ayodhya: అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ.. హన్మాన్‌ ఆలయంలో పూజలు

Arun Chilukuri
Published on: 5 Aug 2020 12:03 PM IST
PM Modi lands in Ayodhya: అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ.. హన్మాన్‌ ఆలయంలో పూజలు
X

PM Modi lands in Ayodhya: ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యకు చేరుకున్నారు. నరేంద్రమోదీ కాసేపట్లో రామధామానికి శ్రీకారం చుట్టనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు విచ్చేశారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగితో కలిసి హనుమన్‌ గడీ ఆలయానికి ఆయన వెళ్లారు.

ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి హారతి ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయన రామజన్మభూమికి తరలివెళ్లారు. 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమిపూజ జరుగనుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. భూమి పూజ చేసిన తర్వాత ప్రధాని మోదీ పారిజాతం మొక్కను నాటుతారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story