PM Modi: ఢిల్లీలో వర్చువల్‌గా రోజ్‌గార్ మేళాను ప్రారంభించిన ప్రధాని మోడీ.. 70 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు

PM Modi 70 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు

Dhatripriya
Published on: 13 Jun 2023 12:57 PM IST
PM Modi Inaugurated The Rozgar Mela Virtually In Delhi
X

PM Modi: ఢిల్లీలో వర్చువల్‌గా రోజ్‌గార్ మేళాను ప్రారంభించిన ప్రధాని మోడీ.. 70 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు 

PM Modi: దేశంలోని 70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని మోడీ పంపిణీ చేశారు. ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపాధి మేళా కింద కొత్తగా నియమితులైన 70 వేల మంది యువతకు మోడీ ఈరోజు నియామక పత్రాలను అందించారు. అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకున్న యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగించారు.

వచ్చే ఏడాదిన్నరలో రోజ్‌గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని... గతేడాది ప్రధాని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ శాఖల్లో ఈ ఉపాధి మేళా క్రింద నియామకాలు జరుగుతున్నాయి. రాబోయే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని మోడీ అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story