PM Modi: ఇవాళ పశ్చిమబెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన

PM Modi: ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 11:51 AM IST
PM Modi: ఇవాళ పశ్చిమబెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
X

PM Modi: ఇవాళ పశ్చిమబెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన

PM Modi: ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోడీ నదియా జిల్లాలోని రాణాఘాట్‌లో దాదాపు 3వేల 200 కోట్ల రూపాయల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని ప్రారంభించనున్నారు. నదియా జిల్లాలో 66 కిలోమీటర్ల పొడవైన బరాజగులి-కృష్ణానగర్ సెక్షన్‌ను నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టును మోడీ ప్రారంభిస్తారు. అనంతరం ఉత్తర జిల్లాలో 17.6 కిలోమీటర్ల పొడవైన బరాసత్- బరాజగులి సెక్షన్‌ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story