PM Modi: అంధుల మహిళల ప్రపంచకప్ విజేతలకు మోడీ ప్రశంస

PM Modi: అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని మోడీని కలుసుకున్నారు.

Arun Chilukuri
Published on: 28 Nov 2025 12:21 PM IST
PM Modi: అంధుల మహిళల ప్రపంచకప్ విజేతలకు మోడీ ప్రశంస
X

PM Modi: అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని మోడీని కలుసుకున్నారు. విజేతలైన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టుకు కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు మోడీ. విజేత జట్టు సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ క్రికెటర్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఫైన‌ల్స్ గెల‌వ‌డంపై వాళ్ల అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరికీ స్వీట్లు తినిపించారు. వారితో కూర్చొని సరదాగా ముచ్చటించారు మోడీ. అనంతరం మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్‌ను మోడీకి బహమతిగా అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story