బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం

*ముఖ్యమంత్రి పరిషత్ పేరుతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో భేటీ

Rama Rao
Updated on: 24 July 2022 8:30 PM IST
PM Modi held a meeting with Chief Ministers of BJP-Ruled States
X

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం

Narendra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాయంలో ముఖ్యమంత్రి పరిషత్ పేరుతో నిర్వహించిన ఈభేటీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి, అస్సాం సీఎం హిమంత బిస్వా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇతరులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోపాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారం, 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంపై ప్రధానంగా చర్చించారు. ఇదిలా ఉంటే 2021 డిసెంబర్ లో వారణాసిలో మోదీ భేటీ అయ్యారు. ఇక ఈ యేడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

Rama Rao

Rama Rao

Next Story