PM Modi: సముద్ర జలాల్లో స్విమ్మింగ్ చేసిన ప్రధాని మోడీ‌.. ఫొటోలు వైరల్‌

PM Modi: ట్విట్టర్‌లో వీడియోకు సంబంధించి గ్లిమ్స్ రిలీజ్

Jyothi
Published on: 5 Jan 2024 11:13 AM IST
PM Modi goes Snorkeling, Enjoys time on Beach in Lakshadweep
X

PM Modi: సముద్ర జలాల్లో స్విమ్మింగ్ చేసిన ప్రధాని మోడీ‌.. ఫొటోలు వైరల్‌

PM Modi: లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు.. సముద్రంలో స్నార్కెలింగ్‌ (సాహసంతో కూడిన స్విమ్మింగ్‌) కూడా చేశారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు. ‘‘లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 140కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు.. మీ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోండి’’ అని మోదీ రాసుకొచ్చారు.

లక్షద్వీప్‌లో తాను స్నార్కెలింగ్‌ కూడా ప్రయత్నించినట్లు మోదీ తెలుపుతూ ఆ చిత్రాలను కూడా షేర్‌ చేశారు. పగడపు దీవులు, చేపల ఫొటోలను పంచుకున్నారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అని పేర్కొన్నారు. స్నార్కెలింగ్‌ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్‌ లాంటిది. స్నార్కెల్‌ అనే ట్యూబ్‌, డైవింగ్‌ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేషించొచ్చు.



Jyothi

Jyothi

Next Story