ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం.. RRR టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు..

ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం.. RRR టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు..

Arun Chilukuri
Published on: 11 Jan 2023 3:37 PM IST
ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం.. RRR టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు..
X

Natu Natu Song: దర్శకుడు రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డును ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకుంది. సినిమాలోని 'నాటు నాటు' పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్‌ అయింది.

కాగా ఈ అవార్డును గెలిచిన తొలి ఇండియన్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచింది. ఈ అవార్డును అందుకున్న కీరవాణికి, ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీంపై ట్విట్టర్‌ వేదికగా ప్రసంశల జల్లు కురిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందంటూ నటినటులను, చిత్ర బృందాన్ని పేరుపేరున అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story