PM Modi: ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయి

PM Modi: ప్రపంచదేశాలు భారత్‌పై విశ్వాసంతో ఉన్నాయి

Jyothi
Published on: 25 May 2023 12:48 PM IST
PM Modi Comment | Telugu News
X

PM Modi: ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయి

PM Modi: విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ తన రెగ్యులర్‌ పనిలో పడిపోయారు. దేవభూమి అయిన ఉత్తరాఖండ్‌ను చేరుకునేందుకు ప్రయాణీకుల సౌకర్యం కోసం ఢిల్లీ-డెహ్రాడూన్‌ మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ సీఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పాల్గొన్నారు. వందేభారత్‌ రైల్‌ సర్వీస్‌తో ఢిల్లీ-డెహ్రాడూన్‌ మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుందన్నారు ప్రధాని మోడీ. వందే భారత్‌ రైలులోని ఆధునిక సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత ఆనంద దాయకం చేస్తాయన్నారు ప్రధాని. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చాలా విశ్వాసంతో చూస్తున్నాయన్నారు. దేశంలో పేదరికం, ఆర్థిక కష్టాలపై పోరాడుతూనే ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదించామన్నారు.

Jyothi

Jyothi

Next Story