PM Modi: క్రీడా మైదానాల‌న్నీ యువ‌త‌తో నిండిపోవాలి

PM Modi: యువతలో క్రీడాసక్తి పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు.

Arun Chilukuri
Published on: 29 Aug 2021 6:02 PM IST
PM Modi Cites Legend Major Dhyanchand’s Example to Inspire Youth in Mann Ki Baat
X

PM Modi: క్రీడా మైదానాల‌న్నీ యువ‌త‌తో నిండిపోవాలి

PM Modi: యువతలో క్రీడాసక్తి పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. భారత క్రీడాకారుల విజయాలు ఇక్కడితో ఆగిపోకూడదని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని అన్ని క్రీడా మైదనాలు యువతతో నిండిపోవాలని మోడీ పిలుపునిచ్చారు. ఇదే ధ్యాన్‌ చంద్‌కు మనమిచ్చే నివాళి అన్నారాయన. 40 ఏళ్ల త‌ర్వాత ఒలింపిక్స్‌లో భార‌త హాకీ జ‌ట్టు మెడ‌ల్ సాధించింద‌ని ప్రధాని మోడీ గుర్తుచేశారు. మోడీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ ఇలా క్రీడాంశాలను ప్రస్తావించారు.

అలాగే స్వ‌చ్ఛ‌భార‌త్ అంశాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని దేశ ప్రజలకు మోడీ మన్‌కీ బాత్‌ వేదికగా సూచించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ స్వ‌చ్ఛ భార‌త్ ర్యాంకుల్లో కొన్నేళ్లుగా నంబ‌ర్ వన్‌గా నిలుస్తోంద‌ని ప్ర‌ధాని మోదీ గుర్తు చేశారు. ఇక కరోనా పరిస్థితులపై స్పందిస్తూ దేశంలో ఇప్ప‌టికీ 62 కోట్ల మంది క‌నీసం ఒక్క‌డోసు టీకా వేయించుకున్నార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా నిబంధ‌న‌ల‌ను అంద‌రూ పాటించాల్సిందేన‌ని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story