Gujarat Elections 2022: ఓటు హక్కు వినియోగించుకున్న మోదీ

Gujarat Elections 2022: గుజరాత్‌ అసెంబ్లీ చివరి దశ పోలింగ్ జోరుగా కొనసాగుతోంది

Jyothi
Published on: 5 Dec 2022 10:36 AM IST
PM Modi Casts his Vote in Ahmedabad
X

Gujarat Elections 2022: ఓటు హక్కు వినియోగించుకున్న మోదీ

Gujarat Elections 2022: గుజరాత్‌ అసెంబ్లీ చివరి దశ పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. లాఫ్ట్‌ ఫేజ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ స్కూల్‌లో ఆయన ఓటు వేశారు. సాధారణ పౌరుల మాదిరిగానే క్యూలైన్‌లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మోడీ. ఓటు వేసిన అనంతరం ఓటు వేసినట్లు తన చూపుడు వేలుకున్న సిరా గుర్తును మీడియాకు చూపించారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోడీ ట్విటర్ వేదికగా విజ్జప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా అహ్మదాబాద్‌లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటు వేసిన అనంతరం ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.

Jyothi

Jyothi

Next Story