PM Modi: ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే కేంద్రం లక్ష్యం

PM Modi: అడ్డంకులకు ముగింపు పలికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం

Jyothi
Published on: 18 Dec 2022 5:32 PM IST
PM Modi Attends Golden Jubilee Meet in Shillong
X

PM Modi: ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే కేంద్రం లక్ష్యం

PM Modi: ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే కేంద్రం లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈశాన్య ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులకు ముగింపు పలికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. షిల్లాంగ్, త్రిపుర రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని మోడీ..ఈశాన్య రాష్ట్రాలను విభజించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయని ఆరోపించారు. షిల్లాంగ్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 6వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. షిల్లాంగ్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

Jyothi

Jyothi

Next Story