మోడీ, అమిత్ షా, దోవల్ కీలక భేటీ

మోడీ, అమిత్ షా, దోవల్ కీలక భేటీ
x
Highlights

జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో ఎన్‌కౌంటర్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు...

జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో ఎన్‌కౌంటర్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. 26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందుతుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మోడీతో భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూ జిల్లాలోని నగ్రోటా సమీపంలో, బన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై ఈ సమావేశంలో చర్చించారు.

26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నగ్రోటా ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు ఉగ్రవాదులు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని సమాచారం. ఈ నలుగురు ఉగ్రవాదులు ఇటీవలే భారత దేశంలోకి అక్రమంగా చొరబడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాదులు భారీ దాడికి కుట్ర పన్నుతూ ఉండవచ్చునని, జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చునని జమ్మూ జోన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories