PM Modi: ఇది చాలా పవిత్రమైన రోజు

PM Modi: లోక్ సభ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Jun 2024 11:18 AM IST
PM Modi Addresses Media Ahead of 18th Lok Sabha Session
X

PM Modi: ఇది చాలా పవిత్రమైన రోజు

PM Modi: లోక్ సభ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని..65కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని మోడీ తెలిపారు. తమకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం ప్రజలు కల్పించారని ఇది చాలా పవిత్రమైన రోజుగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇదో అద్భుతమైన రోజు అంటూ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.

రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్‌ సంకల్పం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దాం అని ఎంపీలకు పిలుపునిచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story