PM Kisan: రైతులకి అలర్ట్‌.. పీఎం కిసాన్ స్టేటస్‌ చెక్ చేశారా..!

PM Kisan Samman Nidhi Yojana 11th Installment Status
x

PM Kisan: రైతులకి అలర్ట్‌.. పీఎం కిసాన్ స్టేటస్‌ చెక్ చేశారా..!

Highlights

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకంలో 12 కోట్ల మంది రైతులు ఉన్నారు. 11వ విడత మొత్తాన్ని ఏప్రిల్, జూలై మధ్య విడుదల చేయాల్సి ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు జమచేస్తుంది. ఈ మొత్తం 2000 చొప్పున మూడు విడతలుగా జమచేస్తుంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు ముందు ప్రభుత్వం 10వ విడత విడుదల చేసింది. కానీ 11వ విడతకు ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో సొమ్ము నిలిచిపోవచ్చు. ఈ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీ మే 31గా నిర్ణయించారు.

కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకంలో రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి. 11వ విడతకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అనుమతి ఇవ్వలేదు. పోర్టల్‌లో స్టేటస్‌ని తనిఖీ చేసినప్పుడు ఈ విషయం మీకు తెలుస్తుంది. స్టేటస్‌ తనిఖీ చేస్తున్నప్పుడు RFT (Request for Transfer) ఉంటే లబ్ధిదారుడి డేటాను రాష్ట్రం తనిఖీ చేసిందని, లబ్ధిదారుడి ఖాతాకు డబ్బును పంపమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించిందని అర్థం. FTO (Fund Transfer Order) కనిపిస్తే ఫండ్ బదిలీ ప్రక్రియ ప్రారంభమైందని అర్థం. ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైన వెంటనే కొద్ది రోజుల్లో మొత్తం మీ ఖాతాకు బదిలీ చేస్తారు.

మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఇంకా నమోదు చేసుకోనట్లయితే వెంటనే నమోదు చేసుకోండి. ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు PM కిసాన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

1. PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండిhttp://www.pmkisan.gov.in 2. ఇక్కడ 'ఫార్మర్స్ కార్నర్' హోమ్ పేజీకి కుడి వైపున కనిపిస్తుంది.

3. ఇక్కడ 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయండి.

4. రిజిస్ట్రేషన్ ఫారమ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

5. మీ సరైన వివరాలతో ఫారమ్‌ను పూరించండి.

6. తర్వాత దాన్ని ఒకసారి సమీక్షించి ఆపై ఓకె బటన్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories